అడిలైడ్ : యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టుపై ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగుల కీలక ఆధిక్యాన్ని దక్కించుకున్న ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 271/4తో పటిష్ట స్థితిలో నిలిచింది.
విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ (142 బ్యాటింగ్, 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో సూపర్ శతకానికి తోడు తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అలెక్స్ కేరీ (52 బ్యాటింగ్), ఉస్మాన్ ఖవాజా (40) రాణించడంతో ఆ జట్టు 356 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు (213/8)తో మూడో రోజు ఆరంభించిన ఆ జట్టు స్టోక్స్ (83), ఆర్చర్ (51) పోరాడటంతో 286 రన్స్‌కు ఆలౌట్ అయింది.