పెర్త్: ఇంగ్లండ్‌తో పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా విక్టరీ దిశగా దూసుకెళ్తున్నది. 205 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఈజీగా బ్యాటింగ్ చేస్తున్నది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) సూపర్ సెంచరీ నమోదు చేశాడు. అతను కేవలం 69 బంతుల్లోనే శతకం కొట్టేశాడు. హెడ్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ట్రావిస్ హెడ్‌కు టెస్టుల్లో ఇది పదో సెంచరీ. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ ఆ తర్వాత చితికిలపడింది. రెండో ఇన్నింగ్స్‌లో 164 రన్స్‌కే ఇంగ్లండ్ అవుట్ కావడంతో.. ఆసీస్‌కు టార్గెట్ ఈజీ అయ్యింది. ఇంగ్లండ్ బౌలర్లు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రఫాడించినా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చేతులెత్తేశారు. హెడ్ దూకుడు గేమ్‌కు ఇంగ్లీష్ పేసర్లు తేలిపోయారు. ఫటాఫటా ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు విక్టరీని సులువు చేశాడు హెడ్.
100 off just 69 balls! Travis Head, what an innings! #Ashes | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/oiV1QEneYp
— cricket.com.au (@cricketcomau) November 22, 2025