దుబాయ్: ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ .. 39 రన్స్ చేసి ఔటయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో.. ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ వరున్ చక్రవర్తి.. ఖాతాలో ట్రావిస్ వికెట్ వెళ్లింది. భారీ షాట్‌కు ప్రయత్నించిన ట్రావిస్.. లాంగ్ ఆఫ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ట్రావిస్ కొన్ని షాట్లతో అలరించాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ అయిదో ఓవర్లో అతను హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. భారీ స్కోర్ దిశగా వెళ్తున్నట్లు కనిపించిన ట్రావిస్.. స్పిన్నర్ వరుణ్‌కు చిక్కాడు. 33 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 రన్స్ చేశాడు ట్రావిస్.
Travis Head gone😭❤️🔥😭❤️🔥 pic.twitter.com/RnKTaMjtEO
— Kuljot (@Ro45Kuljot) March 4, 2025
తాజా సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 66 రన్స్ చేసింది. స్మిత్, లబుషేన్ క్రీజ్‌లో ఉన్నారు.