అడిలైడ్: ట్రావిస్ హెడ్(Travis Head) మోత మోగిస్తున్నాడు. హోం గ్రౌండ్ అడిలైడ్‌లో సెంచరీ నమోదు చేశాడు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు.. ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతున్నాడు. 111 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ చేశాడు. లోకల్ హీరో ట్రావిస్ సెంచరీతో.. స్టేడియంలోని ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. హోం గ్రౌండ్లో హెడ్‌కు ఇది మూడవ టెస్టు సెంచరీ కావడం విశేషం. టెస్టుల్లో ఇది 8వ సెంచరీ అతనికి. కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన హెడ్.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నాడు. ఆసీస్‌ను ఆధిక్యంలోకి తీసుకువెళ్లిన అతను వ్యక్తిగతంగా దూకుడు పెంచేశాడు.
That’s for baby Harrison!
Another home-town ton for Travis Head! #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/u4s6nV62RZ
— cricket.com.au (@cricketcomau) December 7, 2024