Travis Head : వరల్డ్ కప్ పోటీలకు సిద్ధమవుతున్న ఆస్ట్రేలియా(Australia)కు పెద్ద షాకింగ్ న్యూస్. డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన నాలుగో వన్డేలో హెడ్ ఎడమ చేయి విరిగింది. గెరాల్డ్ కోహెట్జీ (Gerald Coetzee) వేసిన 9వ ఓవర్ మొదటి బంతి హెడ్ చేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన ఈ యంగ్‌స్టర్ రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 17 పరుగుల వద్ద మైదానం వీడిన ఈ స్టార్ బ్యాటర్ ఆ తర్వాత బ్యాటింగ్‌కు రాలేదు. అతడి గాయంపై ఆసీస్ హెడ్‌కోచ్ స్పందించాడు.
‘బ్యాటింగ్ చేస్తుండగా హెడ్ చేయి విరిగింది. అతడికి మరిన్ని స్కానింగ్‌లు చేస్తాం. అయితే.. గాయం తీవ్రత ఎంత? కోలుకునేందుకు ఎంత సమయం పడుతుంది? వంటి విషయాలన్నీ రేపు వెల్లడిస్తాం’ అని కంగారు జట్టు హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఓ ప్రకటనలో తెలిపాడు.
హెడ్ చేతిని పరిశీలిస్తున్న ఫీజియో, అంపైర్లు
హెడ్ అనతికాలంలోనే ఆసీస్ జట్టులో కీలకమైన ఆటగాడిగా ఎదిగాడు. 29 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండర్ డబ్ల్యూటీసీ(World Test Championship) ఫైనల్లో టీమిండియాపై, ఆ తర్వాత జరిగిన యాషెస్ సిరీస్(Ashes Series)లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. విధ్వంసక ఆటతో మ్యాచ్‌ను మలుపు తిప్పే హెడ్‌పై ఆసీస్ యాజమాన్యం హెడ్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది. అయితే.. వరల్డ్ కప్ ముందు అతడి చేయి విరగడం నిజంగా ప్యాట్ కమిన్స్ సేనకు పెద్ద ఎదురుదెబ్బ. అయితే… మెగా టోర్నీకి మరో 20 రోజుల సమయం ఉంది. ఆలోపు హెడ్ కోలుకుంటాడా? లేదా? అనేదానిపై స్పష్టత రానుంది.
A tough evening in Pretoria leaves the ODI series with South Africa 2-2 ahead of a must-win game at the Wanderers on Sunday.
Well played to the @ProteasMenCSA and Heinrich Klaason on an incredible batting display #SAvAUS pic.twitter.com/f1E5zinKTW
— Cricket Australia (@CricketAus) September 15, 2023
సెంచూరియన్‌లో జరిగిన నాలుగో వన్డేలో హెన్రిచ్ క్లాసెన్(174), డేవిడ్ మిల్లర్(80) అకాశమే హద్దుగా చెలరేగారు. దాంతో, సఫారీ జట్టు 416 రన్స్ కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ 252 పరుగులకే ఆలౌటయ్యింది. దాంతో, సఫారీ జట్టు 164 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. సిరీస్ డిసైడర్ అయిన ఐదో వన్డే జొహన్నెస్‌బర్గ్‌లో రేపు ఉదయం జరుగనుంది.