Rohit Sharma | రోహిత్‌ను ఊరిస్తున్న ఆసియా కప్.. ధోనీ, అజారుద్దీన్‌ల సరసన నిలిచేనా..?
Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను మరో రికార్డు ఊరిస్తోంది. ఆసియా కప్( Asia Cup 2023)లో తిరుగులేని సారథిగా నిలిచేందుకు హిట్‌మ్యాన్ ఒక్క విజయం దూరంలో ఉన్నాడంతే. ఇప్పటివరకూ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni), మహ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin) మాత్రమే...
Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను మరో రికార్డు ఊరిస్తోంది. ఆసియా కప్( Asia Cup 2023)లో తిరుగులేని సారథిగా నిలిచేందుకు హిట్‌మ్యాన్ ఒక్క విజయం దూరంలో ఉన్నాడంతే. అవును.. ఈసారి ఫైనల్లో టీమిండియా ట్రోఫీ నెగ్గితే రోహిత్ చరిత్రలో స్థానం సంపాదించుకుంటాడు. అంతేకాదు భారత్‌కు రెండో ఆసియా కప్ అందించిన మూడో కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకూ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni), మహ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin) మాత్రమే ఇండియాకు రెండుసార్లు ఆసియా కప్ అందించారు.
అజారుద్దీన్ సారథ్యంలో 1991, 1995లో భారత్ చాంపియన్‌గా అవతరించింది. ధోనీ కెప్టెన్సీలో మన జట్టు 2010, 2016లో ఆసియా కప్ విజేతగా నిలిచింది. మహీ బృందం 2008లో ఫైనల్ చేరినప్పటికీ ఓటమితో సరిపెట్టుకుంది. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 2018లో ఆసియా కప్ చాంపియన్‌గా అవతరించింది.
2018లో ఆసియా కప్ ట్రోఫీ అందుకుంటున్న రోహిత్

వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత జట్టు ట్రోఫీని ముద్దాడడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్‌కోచ్ అయ్యాక ఇండియా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. అందుకని రేపు శ్రీలంకతో జరిగే టైటిల్ పోరు భారత్‌కు చావోరేవో లాంటిది. సూపర్ 4లో శ్రీలంక, పాకిస్థాన్‌ను చిత్తు చేసి రోహిత్ సేన ఫైనల్‌కు చేరింది. మరోవైపు లంక అద్వితీయ పోరాటంతో పాక్‌ను ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు సిద్ధమైంది.
నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌కు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం బెడిసి కొట్టింది. 266 టార్గెట్ ఛేదనలో యువ ఆటగాళ్లు చేతులెత్తేశారు. శుభ్‌మన్ గిల్(122) సెంచరీ, అక్షర్ పటేల్(42) పోరాడినా లాభం లేకపోయింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో బంగ్లా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. లంకతో ఫైనల్ పోరుకు విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, సిరాజ్ మళ్లీ జట్టుతో కలువనున్నారు.
ఇవి కూడా చదవండి
Anurag Thakur: ఉగ్రవాదం ఆపేవరకు.. పాక్‌తో క్రికెట్ ఉండదు: మంత్రి అనురాగ్ ఠాకూర్
Asia Cup 2023 | ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ‘రారా సామి’ పాటతో హోరెత్తిన స్టేడియం.. వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

