న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ చర్మగీతం పాడితేనే ఆ దేశంతో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్దరించడం జరుగుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) తెలిపారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న అనంత్‌నాగ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీమాంతర ఉగ్రవాదం, చొరబాటుదారుల నియంత్రణ జరిగితేనే.. పాకిస్థాన్‌తో క్రికెట్ సిరీస్ పునర్దుదరణ జరుగుతుందని గతంలో బీసీసీఐ పేర్కొన్నదని, దేశ ప్రజల మనోభావాలు కూడా అలాగే ఉన్నాయన్నారు.
ఈ నెల ఆరంభంలో.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలు .. పాకిస్థాన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఏషియా క్రికెట్ మండలితో సమావేశాల్లో పాల్గొనేందుకు వాళ్లు వెళ్లారు. పాక్ ఇచ్చిన ఆతిథ్యం బాగుందని, కానీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఆధారంగా ఇండోపాక్ క్రికెట్ సంబంధాలు ఉంటాయని శుక్లా గతంలో తెలిపారు. వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 14వ తేదీన జరగనున్న ఇండోపాక్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.