Asia Cup 2023 | ఆసియా కప్ చివరి సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా(Team India) పోరాడి ఓడిపోయింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్(Bangladesh) అద్భుత విజయం సాధించింది. 266 పరుగుల ఛేదనలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(121 : 133 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో అక్షర్ పటేల్(42), శార్ధూల్ ఠాకూర్(11) ఎనిమిదో వికెట్‌కు విలువైన 40 పరుగులు జోడించారు. అయితే.. చివరి రెండు ఓవర్లో 17 రన్స్ అవసరం అయ్యాయి. 19వ ఓవరల్ వేసిన ముస్తాఫిజుర్ రెండు బంతుల తేడాతో ఈ ఇద్దరినీ పెవిలియన్ పంపాడు. 50వ ఓవర్ నాలుగో బంతికి షమీ(5) రనౌటయ్యాడు. దాంతో, బంగ్లా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.
అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu arjun) నటించిన పుష్ప (Pushpa) సినిమాలోని సామి సామి (Saami Saami) పాటను డీజే నిర్వాహకులు ప్లే చేశారు. దీంతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఇటు ఇండియన్ ఫ్యాన్స్‌తో పాటు.. అటు బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ఈ పాటను బాగా ఎంజాయ్ చేశారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
pic.twitter.com/hG8IVTDeTK https://t.co/ffhArmVI6l
— Jitesh Sharma’s vakeel (@neelakhoon) September 15, 2023
ఇదిలా ఉండగా.. ఈజీగా గెలుస్తుందనుకున్న భారత్‌కు బంగ్లా బౌలర్లు షాకిచ్చారు. యువ పేసర్ తంజిమ్ హొసేన్ షకిబ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ(0) డకౌటయ్యాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ(5) నిరాశపరిచాడు. గత మ్యాచ్ హీరోలు కేఎల్ రాహుల్(19), ఇషాన్ కిషన్(5) వెంట వెంటనే ఔటయ్యారు. షకిబుల్ హసన్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్(26), ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా(7) బౌల్డ్ కావడంతో, 170 పరుగుల వద్ద ఇండియా ఆరో వికెట్ కోల్పోయింది. అక్కడి నుంచి గిల్ ఒంటిచేత్తో భారత స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. సెంచరీ తర్వాత ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యాడు.