Rohit Sharma : భారత క్రికెట్ జట్టు కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మళ్లీ టాస్ ఓడాడు. వరుసగా 12 సార్లు టాస్ (Toss) ఓడిపోయి వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్, ఆ దేశ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా (Brian Lara) రికార్డును సమం చేశాడు. లారా కూడా వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయి ఇప్పటిదాకా ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇవాళ రోహిత్ శర్మ ఆయనకు జతచేరాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ న్యూజిలాండ్ (Newzealand) తో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు కూడా రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. దాంతో ఈ అన్వాంటెడ్ రికార్డులో లారాను సమం చేశాడు. రోహిత్ శర్మ 2023 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు వరుసగా 12 వన్డే మ్యాచ్‌లలో టాస్ ఓడాడు.
బ్రియాన్ లారా 1998 అక్టోబర్ నుంచి 1999 మే వరకు వరుసగా 12 సార్లు వన్డే మ్యాచ్‌లలో టాస్ ఓడిపోయాడు.
ఈ ఇద్దరి తర్వాత రెండో స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ పీటర్ బోరెన్ ఉన్నారు. ఆయన మార్చి 2011 నుంచి ఆగస్టు 2013 వరకు వరుసగా 11 వన్డే మ్యాచ్‌లలో టాస్ గెలువలేకపోయాడు.
హిట్ మ్యాన్ మరో మ్యాచ్‌లో టాస్ ఓడితే బ్రియాన్ లారా రికార్డు బద్దలు కానుంది. వరుసగా 13 వన్డే మ్యాచ్‌లలో టాస్ ఓడిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ జాబితాలో టాప్ ప్లేస్‌కు చేరుకోనున్నాడు. అదేవిధంగా టీమిండియా కూడా ఈ మ్యాచ్‌తో వరుసగా 15 వన్డేల్లో టాస్ ఓడింది.