లండన్: కీలకమైన ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్.. కోచ్ ఆండీ ముర్రేతో ప్రయాణానికి ఫుల్స్టాప్ పెట్టాడు. గతేడాది ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యాక జొకో కోరడంతో ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు అతడితో చేతులు కలిపిన ముర్రే.. ఆరు నెలలు తిరుగకముందే కోచ్ స్థానం నుంచి తప్పుకున్నాడు.
తాము కలిసి పనిచేయడం లేదన్న విషయాన్ని ఇద్దరు దిగ్గజాలూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సీజన్లో జొకో ఇంతవరకూ ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. మియామి, మ్యాడ్రిడ్ ఓపెన్ ఫైనల్స్‌లో అతడికి చుక్కెదురైంది.