మాంటెకార్లో : మాంటెకార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో టాప్‌ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ విజయం కోసం చెమటోడ్చాడు. రష్యన్ క్వాలిఫయర్ ఇవాన్ గఖొవ్తో జరిగిన రెండోరౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 7-6(7-5), 6-2తో చెమటోడ్చి గెలిచాడు. మార్చి తరువాత ఆడుతున్న తొలి టోర్నీలో విజయంకోసం జొకోవిచ్ శ్రమించాడు.
తొలి సెట్ ఏడో గేమ్‌లో గఖొవ్ బ్రేక్ సాధించి 4-3 ఆధిక్యంలో నిలిచాడు. తరువాతి గేమ్‌లోనే బ్రేక్ సాధించిన జొకోవిచ్ తొలి సెట్‌ను టైబ్రేక్ ద్వారా గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్లో జొకోవిచ్‌కు ఎదురులేకపోయింది. రెం డు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో జొకో విజయం సాధించాడు.