కొలంబో: ఇషాన్ కిషన్.. ఈ జార్ఖండ్ డైనమైట్ ఆడిన తొలి వన్డేలోనే పేలింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ వన్డే అరంగేట్రం చేశాడు. అంతేకాదు వచ్చీ రాగానే ఓ భారీ సిక్స్‌తో వన్డేల్లో తన ఖాతా తెరిచాడు. అయితే ఇలా తాను ఫస్ట్ బాల్కే సిక్స్ కొడతానని ముందే టీమ్ మేట్స్‌కు చెప్పి వచ్చినట్లు ఇషాన్ చెప్పడం విశేషం. మ్యాచ్ తర్వాత యజువేంద్ర చాహల్‌తో చేసిన చిట్‌చాట్‌లో ఇషాన్ ఈ విషయం చెప్పాడు. ఐపీఎల్లో ముంబై తరఫున ఆడుతున్న ఇషాన్ కిషన్.. తన మెరుపు బ్యాటింగ్‌తో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సంజు శాంసన్ గాయపడటంతో అనుకోకుండా తుది జట్టులో అడుగుపెట్టిన అతడు.. వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకోలేదు. 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేసి టీమ్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
Chahal TV returns – Ishan Kishan reveals the secret behind his first ball SIX and more 👌 👌
— BCCI (@BCCI) July 19, 2021
Some fun & cricket talks as @yuzi_chahal chats up with ODI debutant @ishankishan51 😎😎 – by @ameyatilak & @28anand
Full video 🎥 👇 #TeamIndia #SLvIND https://t.co/BWQJMur8zx pic.twitter.com/HtFGNyoHeI