India Vs Pakistan | మహిళల ప్రపంచకప్‌లో భాగంగా హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్-ఏలో సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే టీమ్ఇండియాకు నేటి మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. దుబాయ్ వేదికగా జరుగబోయే మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలవనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.
గ్వాలియర్: స్వదేశంలో భారత్ మరో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఇటీవలే ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించి జోరుమీదున్న టీమ్ఇండి యా.. పొట్టి పోరులోనూ అదే దూ కుడు ప్రదర్శించాలనే పట్టుదలతో ఉంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కొత్తగా పునర్నిర్మించిన శ్రీమంత్ మాధవరావు సింధియా స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. 14 ఏండ్ల తర్వాత ఈ స్టేడియంలో జరుగనున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే.
త్వరలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ వంటి కీలక ఆటగాళ్లకు విరామమిచ్చిన భారత్.. యువ ఆటగాళ్లను పరీక్షించనుంది. నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్, యువ ఆల్ రౌండర్ నితీశ్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా తొలి టీ20లో అరంగేట్రం చేసే అవకాశముంది. భారత్‌తో పోల్చితే అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కలిగిన బంగ్లాదేశ్.. ఆతిథ్య జట్టుకు షాకివ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. టెస్టుల మాదిరిగా కాకుండా టీ20లలో దూకుడుగా ఆడతామని ఇప్పటికే ఆ జట్టు సారథి లిటన్ దాస్ భారత్‌కు హెచ్చరికలు కూడా పంపాడు. దిగ్గజ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే.