మౌంట్ మాంగనుయి: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ పరాజితులు భారత్, న్యూజిలాండ్ కొత్త సిరీస్లో బోణీపై కన్నేసాయి. న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి పోరు వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్లో శుభారంభం చేసేందుకు ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. రెండో మ్యాచ్కు కూడా వర్షం గండం ఉన్నందున సిరీస్ మొదలవుతుందా అన్నది అనుమానంగా మారింది. భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్ విషమ పరీక్షే. అతడి సారథ్యంలో కొత్త జట్టు ఎలా ఆడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. యువకులతో కూడిన భారత జట్టును హార్దిక్ ఇప్పటికీమూడుసార్లు నడిపించాడు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశముంది.