భారత్, దక్షిణాఫ్రికా మధ్య పొట్టిపోరుకు వేళయైంది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తెరలేవనుంది. ఇటీవల బంగ్లాదేశ్‌పై క్లీన్‌స్వీప్ విజయంతో టీమ్ఇండియా మంచి జోరుమీదుంటే..సొంతగడ్డపై సత్తాచాటేందుకు సఫారీలు సై అంటున్నారు. టీ20 ప్రపంచకప్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. టీమ్ఇండియాపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు పావులు కదుపుతున్నది.
మరోవైపు కుర్రాళ్లతో కళకళలాడుతున్న సూర్యకుమార్‌సేన సత్తా చాటాలని చూస్తున్నది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ అదరగొట్టేందుకు కుర్రాళ్లు కసిమీదున్నారు. ఇటీవలే సొంతగడ్డపై టెస్టుల్లో కివీస్ చేతిలో ఎదురైన దారుణ పరాభవాన్ని మరిపించేందుకు భారత్ సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కనుంది. భారీ స్కోర్లకు వేదికైన డర్బన్‌లో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశముంది.
Team India | డర్బన్: ప్రపంచంలో రెండు అత్యుత్తమ జట్ల మధ్య పొట్టి పోరు అభిమానులను అలరించబోతున్నది. డర్బన్ వేదికగా శుక్రవారం తొలి టీ20 పోరు జరుగనుంది. 2026 సొంత ఇలాఖాలో జరుగనున్న పొట్టి ప్రపంచకప్ నాటికి పటిష్ట జట్టును తీర్చిదిద్దేందుకు టీమ్ఇండియా వ్యూహాలు రచిస్తున్నది. ఇందులో భాగంగా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో..దేశవాళీ, ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తున్న కుర్రాళ్లకు జాతీయ జట్టులో అవకాశం కల్పించింది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఇప్పటికే రింకూసింగ్, అర్ష్‌దీప్‌సింగ్, తిలక్‌వర్మ, రవిబిష్ణోయ్ లాంటి సత్తాచాటుతున్నారు.
అయితే రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ లాంటి దిగ్గజాల వెలితి ఏమాత్రం కనిపించకుండా కుర్రాళ్లు దుమ్మురేపుతున్నారు. బంగ్లాతో చివరి మ్యాచ్‌లో ధనాధన్ సెంచరీతో సీనియర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఫామ్‌లోకి రాగా, మరో ఓపెనర్ అభిషేక్‌శర్మ ఫామ్ టీమ్ మేనేజ్మెంట్ను ఆందోళన కల్గిస్తున్నది. శాంసన్‌కు తోడు అభిషేక్ టచ్‌లోకి వస్తే..టీమ్ఇండియాను ఆపడం సఫారీలకు కష్టమే. వీరికి సీనియర్లు సూర్యకుమార్, హార్దిక్‌పాండ్యా, అక్షర్‌పటేల్ అండగా ఉన్నారు. కెరీర్ మొదట్లో తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న తిలక్‌వర్మ ఈ మధ్య స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. సఫారీలతో ఈ సిరీస్‌లోనైనా తిలక్ ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. బౌలింగ్ విషయానికొస్తే..అర్ష్‌దీప్‌సింగ్ నాయకత్వం వహిస్తుండగా, అవేశ్‌ఖాన్, యశ్ దయాల్, వైశాఖ్ ఇంకా పరిణతి సాధించాల్సి ఉంది.
సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ సత్తాచాటాలని సఫారీలు సిద్ధంగా ఉన్నారు. కెప్టెన్ మార్క్మ్ ఫామ్‌లో లేకపోవడం జట్టుకు లోటుగా కనిపిస్తున్నది. ఈ ఏడాది ఆడిన 14 ఇన్నింగ్స్‌లో మార్క్మ్ ఒకే సారి 25 పరుగుల మార్క్ దాటాడు. దీనికి తోడు ప్రపంచకప్ ఆడిన క్వింటన్డికాక్, రబాడ, నోకియా, శంసీ లేకుండా భారత్‌కు ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
భారత్: శాంసన్, అభిషేక్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్‌వర్మ, హార్దిక్, రింకూసింగ్, రమన్‌దీప్‌సింగ్, అక్షర్‌పటేల్, అవేశ్‌ఖాన్, అర్ష్‌దీప్‌సింగ్, వరుణ్ చక్రవర్తి దక్షిణాఫ్రికా: హెండ్రిక్స్, రికల్టన్, మార్క్మ్(్రకెప్టెన్), స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్/కొట్జె, సిమ్లెన్, పీటర్, మహారాజ్, బార్ట్‌మన్.