కోల్‌కతా: రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ కోచింగ్ సిబ్బంది నియామకాన్ని పూర్తిచేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే హెడ్‌కోచ్‌గా అభిషేక్ నాయర్, అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్‌ను ఎంపిక చేసుకున్న ఆ జట్టు.. తాజాగా బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ టిమ్ సౌథీని నియమించుకుంది.
కివీస్ తరఫు అంతర్జాతీయ స్థాయిలో 776 వికెట్లు తీసిన అనుభవమున్న సౌథీ.. కేకేఆర్ తరఫున మూడు సీజన్ల (2021-2023 వరకూ)లో ప్రాతనిథ్యం వహించాడు.