IPL 2024 MI vs DC : సొంత స్టేడియంలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) బ్యాటర్లు చితక్కొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించారు. రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(44) శుభారంభమివ్వగా.. విధ్వంసక ప్లేయర్ టిమ్ డేవిడ్(45 నాటౌట్), రొమారియో షెపర్డ్(39 నాటౌట్)లు చివర్లో వీరవిహారం చేశారు. దాంతో ముంబై 5 వికెట్ల నష్టానికి 234 రన్స్ కొట్టింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు, అన్రిచ్ నోకియాలు రెండేసి వికెట్లు పడగొట్టారు.
Innings Break!
A power-packed batting effort powers #MI to a formidable 234/5 🔥
Can Delhi Capitals chase it down 🤔
Follow the Match ▶ https://t.co/Ou3aGjpb7P #TATAIPL | #MIvDC pic.twitter.com/TMHiX0LW4P
— IndianPremierLeague (@IPL) April 7, 2024
టాస్ ఓడిన ముంబై 80 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్‌ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత దంచికొడుతున్న ఓపెనర్ ఇషాన్ కిషన్(42) సైతం అక్షర్ పటేల్ ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, ముంబై 111 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(39) తో కలిసిన. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(6) ధనాధన్ ఆడలేకపోయాడు.
దాంతో ముంబై స్కోర్ 180 ప్లస్ స్కోర్ చేయడం కష్టమనిపించింది. కానీ, టిమ్ డెవిడ్(45 నాటౌట్), రోమారియో షెపర్డ్(39 నాటౌట్)లు చితక్కొట్టారు. ఈ ఇద్దరూ కేవలం 13 బంతుల్లోనే 53 రన్స్ జోడించి ముంబైకి కొండంత స్కోర్ అందించారు.