IND vs WI : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో తిలక్ వర్మ (51 : 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీ కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలిఅర్ధ శతకం నమోదు చేశాడు. ఒబెడ్ మెక్కాయ్ ఓవర్లో సింగిల్ తీసి అతను ఫీఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడిన తిలక్.. ఇషాన్ కిషన్(27), హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోర్‌ను పరుగెత్తించాడు. ఆ తర్వాత భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద మెక్కాయ్ చేతికి చిక్కాడు. దాంతో, భారత్ 114 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
గయానాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ, టీమిండియాకు శుభారంభం దక్కలేదు. శుభ్‌మన్ గిల్(7), సూర్యకుమార్ యాదవ్1() తక్కువకే వెనుదిరిగారు. తొలి మ్యాచ్‌లో విఫలమైన సంజూ శాంసన్(7) మరోసారి నిరాశ పరిచాడు. అకీల్ హొసేన్ ఓవర్లో ఫ్రంట్‌ఫుట్ వచ్చి స్టంపౌట్ అయ్యాడు.