IPL Playoffs | ముల్లాన్‌పూర్: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు వేదికైన ముల్లాన్‌పూర్‌లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా త్రివిధ దళాలు పాక్‌లోని ఉగ్రశిబిరాలపై దాడితో పోలీసులు మ్యాచ్ కోసం భారీ భద్రత కల్పించారు.
ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రేక్షకులు వచ్చే అవకాశముందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశామని పంజాబ్ స్పెషల్ డీజీపీ అర్పిత్ శుక్లా పేర్కొన్నారు. 65 మంది ఉన్నతాధికారులకు తోడు 2,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.