అహ్మాదాబాద్: ఐపీఎల్(IPL2023)లో ఆదివారం రాజస్థాన్, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ గమ్మత్తు ఘటన జరిగింది. గుజరాత్ బ్యాటర్ సాహా ఆరంభంలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే ఆ బంతి గాల్లోకి బాగా పైకి లేచింది. ఇక క్యాచ్‌ను అందుకునేందుకు ముగ్గురు ఫీల్డర్లు పరుగెత్తుకుంటూ వచ్చారు. కీపర్ సంజూ శాంసన్, హిట్మేయర్, మరో ప్లేయర్ ఆ క్యాచ్‌ను అందుకునేందుకు ట్రై చేశారు. అయితే ఆ బంతి కీపర్ సంజూ గ్లౌజ్‌లో పడి లేచింది. కానీ ఫన్నీ విషయం ఏంటంటే.. బౌలర్ బౌల్ట్ ఆ క్యాచ్‌ను చివరకు అందుకున్నాడు. దీంతో సాహా కాటన్ బౌల్డ్ అయ్యాడు. క్యాచ్ కోసం ముగ్గురు ప్లేయర్లు కుస్తీ పడితే, నాలుగో ప్లేయర్ ఆ క్యాచ్‌ను పట్టుకోవడం హైలెట్. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిచింది. ఆ ఫన్నీ వీడియో ఇదే చూడండి.
3⃣ players converge for the catch 😎
4⃣th player takes it 👏
🎥 Safe to say that was one eventful way to scalp the first wicket from @rajasthanroyals!
Follow the match 👉 https://t.co/nvoo5Sl96y #TATAIPL | #GTvRR pic.twitter.com/MwfpztoIZf
— IndianPremierLeague (@IPL) April 16, 2023