Hyderabad Coach : స్వదేశంలో టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ తిలక్ వర్మ (Tilak Varma)కు సర్జరీ కావడం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ఆసియా కప్ ఫైనల్లో ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించిన ఈ తెలుగు కుర్రాడు కోలుకునేది ఎప్పుడు? ప్రపంచకప్ టోర్నీకి దూరమవ్వడం ఖాయం? అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. హైదరాబాద్ క్రికెట్ టీమ్ కోచ్(Hyderabad Coach) డీబీ రవి తేజ (Ravi Teja) మాత్రం అదేం లేదంటున్నాడు. తిలక్ ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదు. అతడు త్వరలోనే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడుతాడని రవి తేజ అన్నాడు.
‘రాజ్‌కోట్‌లో బుధవారం తిలక్ వర్మకు మైనర్ సర్జరీ అయింది. అతడి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిందేమీ లేదు. మూడు, నాలుగు రోజుల్లో అతడు కోలుకుంటాడు. జనవరి 8న జమ్ము కశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు ఆడతాడు. ఈరోజు కూడా ఆడేందుకు తిలక్ సిద్ధంగా ఉన్నాడు. అయితే.. నాకౌట్‌కు హైదరాబాద్ అర్హత సాధించే అవకాశాలు లేనందున అతడిని ఆడించి రిస్క్ తీసుకోవడం సరి కాదనిపించింది’ అని రవి తేజ వెల్లడించాడు.
An optimistic update on Tilak Varma 👀#CricketTwitter #INDvsNZ #INDvNZ pic.twitter.com/ZnDov2obq2
— Cricbuzz (@cricbuzz) January 8, 2026
ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య జనవరి 21 నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 31న చివరి మ్యాచ్ జరుగనుంది. ఆ తర్వాత భారత్, శ్రీలంక వేదికగా ప్రపంచ కప్ మొదలవ్వడానికి వారం రోజులు ఉంటుందంతే.
పొట్టి ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మ ప్రపంచకప్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. నిరుడు ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై అజేయ అర్థ శతకంతో మెరిసిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లోనూ చెలరేగాడు. రెండు మ్యాచుల్లోనూ శతకాలు (143, 109) బాదేసిన ఈ చిచ్చరపిడుగు.. రాజ్‌కోట్‌లో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా గాయపడ్డాడు. దాంతో, అతడికి టెస్టిక్యులర్ టార్సన్ సర్జరీ చేశారు వైద్యులు.