న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ ఫలితాల్లో మనోళ్లు సత్తా చాటారు. టాపర్లలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. హర్ష్‌గుప్తా, వావిలాల అజయ్‌రెడ్డి, బనిబ్రత మాజీ 300కు 300 మార్కులతో సత్తాచాటారు. మొత్తంగా 24 మందికి 100 పర్సంటైల్ రాగా, వారిలో ముగ్గురు తెలంగాణకు చెందిన విద్యార్థులు ఉండటం గమనార్హం. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2025 పేపర్-1 (బీఈ/బీటెక్) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది. టాపర్స్‌లో ఇద్దరు బాలికలు ఉన్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుత్తికొండ సాయిమనోజ్ఞ, మరొకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన దేవదత్త మాఝీ. నూటికి 100 శాతం మార్కులు సాధించిన 24 మందిలో ఏడుగురు రాజస్థాన్‌కు చెందినవారు ఉన్నారు.
ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(4), తెలంగాణ(3), ఉత్తరప్రదేశ్(3), పశ్చిమ బెంగాల్(2) ఉన్నాయి. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ను జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండు సెషన్స్‌లో నిర్వహించారు. జనవరి సెషన్‌కు 13,11,544 మంది నమోదు చేసుకుని, 12,58,136 మంది హాజరయ్యారు. ఏప్రిల్ సెషన్‌కు 10,61,840 మంది నమోదు చేసుకుని, 9,92,350 మంది పరీక్ష రాశారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్షను 13 భాషల్లో 300 నగరాల్లో నిర్వహించారు. వీటిలో దుబాయి, సింగపూర్, దోహా, వాషింగ్టన్ డీసీ వంటి 15 అంతర్జాతీయ కేంద్రాలు కూడా ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్డ్, 2025కు హాజరయ్యేందుకు అర్హత కోసం క్యాటగిరీవారీగా పర్సంటైల్ కటాఫ్స్ను ఎన్టీఏ ప్రకటించింది. అర్హత సాధించినవారు మాత్రమే వచ్చే నెల 18న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరుకానున్నారు. అడ్వాన్స్డ్ పరీక్షకు ఈనెల 23 నుంచి వచ్చే నెల 2 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
110 మంది ఫలితాల నిలిపివేత..
జేఈఈ మెయిన్‌లో 110మంది అభ్యర్థుల ఫలితాలను ఎన్టీఏ నిలిపివేసింది. అక్రమాలకు పాల్పడమే కాకుండా, ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించారన్న ఆరోపణలతో ఆయా విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టింది. విద్యార్థుల ఫొటోలు, బయోమెట్రిక్ హాజరులో పోలికలు లేకపోవడంతో ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాశారా..? అన్న కోణంలో ఎన్టీఏ విచారణ జరుపుతున్నది.సోషల్ మీడియాకు దూరంగా ఉండి సక్సెస్ అయ్యాసోషల్మీడియాకు దూరంగా ఉండి సక్సెస్ అయ్యా. సెలవులు, ఇంటికెళ్లినప్పుడు మా త్రమే సోషల్‌మీడియాను వాడేవాడిని. ఇదే నా విజయ మంత్రం. ఐఐటీ బాంబేలో చదవాలన్న లక్ష్యంతో అహోరాత్రులు శ్రమించా. జేఈఈ మెయిన్ కోసం రోజుకు 10 గంటలు కష్టపడ్డా. వీక్లీ, మంత్లీ టెస్టులతో లోపాలు, తప్పులు సవరించుకుంటూ ముందుకెళ్లాను. ఒత్తిడికి లోనైనప్పుడు ఆటలాడేవాడిని.
– అజయ్‌రెడ్డి, జేఈఈ మెయిన్ టాపర్
కెమిస్ట్రీ కష్టంగా అనిపించింది
నాకు సోషల్ మీడియా అంటే ఆసక్తేలేదు. నాకింకా సోషల్ మీడియా అకౌంటే లేదు. రోజుకు 12-14 గంటలు కష్టపడేవాడిని. కెమిస్ట్రీ కష్టంగా అనిపించింది. లెక్చరర్లు నేను చేసే తప్పులను సవరించేవారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఆడేవాడిని. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించాలన్నదే నా లక్ష్యం. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ బీటెక్‌లో చేరుతా.
-బనిబ్రత మాజీ,జేఈఈ టాపర్
కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరుతా
మా కుటుంబం గచ్చిబౌలిలో ఉంటుంది. నాన్న కెమికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. ఆకాశ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నా. జేఈఈ మెయిన్‌లో ఆలిండియా టాప్ ర్యాంకు రావడం సంతోషాన్నిచ్చింది. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నా. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంక్ తెచ్చుకుని, ఐఐటీ బాంబే, కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరుతా.
– హర్ష్‌గుప్తా, జేఈఈ మెయిన్ టాపర్ విభాగం
అర్హత పర్సంటైల్ కటాఫ్