ఢిల్లీ: బ్రెజిల్ వేదికగా జరుగుతున్న 17వ ప్రపంచ వుషూ చాంపియన్‌షిప్స్‌లో భారత్ అదరగొడుతున్నది. మహిళల విభాగంలో ముగ్గురు భారత ప్లేయర్లు ఫైనల్‌కు చేరి పతకాలు ఖాయం చేసుకున్నారు.
మహిళల 52 కిలోల విభాగం సెమీస్‌లో అపర్ణ.. 60 కి. క్యాటగిరీలో కరీనా కౌషిక్, 72 కేజీల సెమీస్ పోరులో శివానీ తమ ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్ చేరారు. పురుషుల విభాగంలో సాగర్ దహియా (56 కి.) సెమీస్‌కు దూసుకెళ్లగా విక్రాంత్ బలియన్ (75 కి.)క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు.