Team India Head Coach | టీమిండియా హెడ్‌కోచ్ రేసులో మాజీ ఓపెన్ గౌతమ్ గంభీర్ తొలి రౌండ్ ఇంటర్వ్యూ పూర్తయ్యింది. వీసీలో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. గౌతీకి పోటీ ఇస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ రామన్ సైతం ఇంటర్వ్యూకి ప్రత్యక్షంగా హాజరయ్యారు. క్రికెట్‌పై వారి ఆలోచన విధానాలు, కోచ్‌గా ఎంపికైతే ఎలా వ్యవహరిస్తారనే సామర్థ్యాలను గుర్తించడమే లక్ష్యంగా బీసీసీఐ నియమించిన క్రికెట్ సలహా కమిటీ (CAC) ఇద్దరికి పలు ప్రశ్నలు సంధించింది. జట్టు కోచింగ్ స్టాఫ్‌పై మీ ఆలోచనలు ఏంటీ ? అంటూ తొలి ప్రశ్న వేసింది. ఆ తర్వాత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొందరు పెద్ద వయసు ఆటగాళ్లు ఉన్నప్పుడు.. ఆ జట్టు పరివర్తన దశను మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? అంటూ కమిటీ ప్రశ్నించింది.
ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో జట్టు వైఫల్యం, తీరికలేని షెడ్యూల్ నిర్వహణ అంశాలకు సంబంధించి వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు, ఫిట్నెస్ ప్రమాణాలపై అభిప్రాయాలను చెప్పాలని కోరింది. అయితే, ఈ మూడు ప్రధాన ప్రశ్నలను బీసీసీఐ కమిటీ వేసిందని ‘రెవ్‌స్పోర్ట్స్’ అనే క్రీడా వెబ్సైట్ పేర్కొంది. కాగా, టీమిండియా హెడ్ కోచ్ పదవికి గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపు పూర్తయినట్లేనని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్-2024 ట్రోఫీని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గెలవడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో బీసీసీఐ గౌతీ వైపే మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, రామన్ సైతం తాను కోచ్ రేసులో ఉన్నానని తెలిపారు. ఇంటర్వ్యూ చాలా బాగా జరిగిందన్నారు. 2011 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న గౌతమ్ గంభీర్‌కి కోచ్ పదవి ఇచ్చినా ఫర్వాలేదన్నారు. గంభీర్ ఎల్లప్పుడూ చురుకుగా, వ్యూహాత్మకంగా ఉంటాడని రామన్ చెప్పారు.