ఇది సెకండ్ రేట్ టీమ్ కాదు.. రణతుంగతో విభేదించిన అరవింద డిసిల్వా

కొలంబో: ఓ సెకండ్ రేట్‌ను ఇండియా పంపించింది. ఇది శ్రీలంక క్రికెట్‌ను అవమానించడమే అని ఆ మధ్య ఆ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కామెంట్ చేసిన సంగతి తెలుసు కదా. అయితే చాలా మంది అతని వ్యాఖ్యలతో విభేదించారు. తాజాగా 1996 వరల్డ్‌కప్ శ్రీలంక గెలవడంలో కీలకపాత్ర పోషించిన అరవింద డిసిల్వా కూడా తన కెప్టెన్‌తో విభేదించాడు. అసలు దీనిని సెకండ్ రేట్ టీమ్ అని అనలేమని అతడు స్పష్టం చేశాడు. ఇండియాలో పెద్ద మొత్తంలో టాలెంట్ ఉన్న ప్లేయర్స్ అందుబాటులో ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఏ టీమ్‌ను కూడా సెకండ్ రేట్ టీమ్ అని అనలేరు అని డిసిల్వా అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం కరోనా కారణంగా చాన్నాళ్లపాటు ఓ ప్లేయర్ బబుల్‌లో ఉండాల్సి వస్తోందని, అందుకే అన్ని టీమ్స్ ప్లేయర్స్ రొటేషన్‌పై దృష్టి సారించాయని డిసిల్వా చెప్పాడు. ఆ లెక్కన భవిష్యత్తులో ఇలాంటి టీమ్స్‌ను పంపడం సాధారణ విషయంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నాడు. ఒకవేళ అలాంటి టీమ్స్‌ను పంపినా.. దానిని రొటేషన్‌లో భాగంగా చూడాలి తప్ప.. సెకండ్ లేదా థర్డ్ రేట్ టీమ్‌గా చూడకూడదని స్పష్టం చేశాడు.
అటు రణతుంగ వ్యాఖ్యలకు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఘాటుగానే స్పందించింది. ఇక్కడికి వచ్చిన 20 మంది సభ్యుల్లో 14 మంది ఇండియన్ టీమ్‌కు అన్ని ఫార్మాట్లు లేదా ఏదో ఒకదాంట్లో ప్రాతినిధ్యం వహించినవారే. వాళ్లను ఎలా సెకండ్ రేట్ టీమ్ అంటారు అని బోర్డు ప్రశ్నించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

