ఆదిలోనే భారత్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. భారత్, పాక్ మ్యాచ్‌లో టాస్ గెలిచి పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్ బరిలోకి దిగింది. అయితే.. భారత్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో వికెట్ కేఎల్ రాహుల్ కూడా ఔటయ్యాడు. రెండు వికెట్లను తీసింది షాహీన్ అఫ్రిదీయే. తర్వాత ఆరో ఓవర్లో సూర్య కుమార్ యాదవ్‌ను హసన్ అలీ ఔట్ చేశాడు. హసన్ అలీ బంతి వేయగా.. మహమ్మాద్ రిజ్వాన్‌కు సూర్య కుమార్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఇప్పటి వరకు మూడు వికెట్లను కోల్పోయింది.
మూడో వికెట్ కోల్పోయే సమయానికి భారత్ 31 పరుగులు చేసింది. రోహిత్ శర్మ ఒక బంతిలో డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ 8 బంతుల్లో 3 పరుగులు చేశాడు. ఇక.. విరాట్ కోహ్లీ 17 బంతుల్లో 16 పరుగులు చేయగా.. సూర్యకుమార్ 8 బంతుల్లో 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, పంత్ ఉన్నారు.
Match 16. 5.4: WICKET! S Yadav (11) is out, c Mohammad Rizwan b Hasan Ali, 31/3 https://t.co/eNq46RHDCQ #INDvPAK #T20WC
— BCCI (@BCCI) October 24, 2021
😲 The excitement is palpable!
— ICC (@ICC) October 24, 2021
We're at the Dubai International Stadium today for the India v Pakistan match – the third of our four venues to host the #T20WorldCup.@bookingcom pic.twitter.com/aOPuq73veL
Match 16. 5.6: H Ali to V Kohli (20), 4 runs, 36/3 https://t.co/eNq46RHDCQ #INDvPAK #T20WC
— BCCI (@BCCI) October 24, 2021