ODI runs : వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్ మ్యాచ్లలో ఛేజింగ్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-3 లో ముగ్గురూ భారతీయులే ఉన్నారు. ఈ జాబితాలో 8,720 పరుగులతో అగ్రస్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కొనసాగుతున్నాడు. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆ తర్వాత స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఛేజింగ్లో 8000 పరుగుల మైలురాయిని దాటాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 8 వేల పరుగుల మైలురాయిని దాటాడు. కోహ్లీ తర్వాత 6,115 పరుగులతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత స్థానాల్లో శ్రీలంక స్టార్ బ్యాటర్ సనత్ జయసూర్య (5,742 పరుగులు), దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్ (5,575 పరుగులు) ఉన్నారు.