Vaibhav Sooryavanshi: ఆ సంకేతానికి అర్థం లేదు.. సూర్యవంశీ వెరైటీ సెలబ్రేషన్.. వీడియో
Vaibhav Sooryavanshi: వైభవ్ వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. లక్నోతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత ఓ సంకేతాన్ని ఇచ్చాడు. అయితే ఆ సంకేతానికి అర్థం ఏమీ లేదని రాజస్థాన్ బ్యాటర్ అన్నాడు. సూర్యవంశీ ఆ మ్యాచ్‌లో 38 బంతుల్లో 93 రన్స్ చేశాడు.
జైపూర్: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi).. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో దుమ్మురేపాడు. కేవలం 38 బంతుల్లో 93 రన్స్ చేశాడు. ఆ రాజస్థాన్ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో పది సిక్సర్లు, ఏడు బౌండరీలు ఉన్నాయి. అయితే హాఫ్ సెంచరీ చేసిన తర్వాత వైభవ్ వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. రెండు చేతి వేళ్లను క్రాస్ చేస్తూ ఓ ఫోజ్ ఇచ్చారు. ఆ సెలబ్రేషన్లో వాస్తవానికి సూర్యవంశీ ఎటువంటి సంకేతాన్ని ఇస్తున్నాడో అర్థం కాలేదు. ఇక ఆ భారీ స్కోరు మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత మురళీ కార్తీక్‌తో ఆ సంకేతం గురించి మాట్లాడారు. ఆ సంకేతం వెనుక తాత్పర్యం ఏంటని మురళీ ప్రశ్నించారు. దానికి సూర్యవంశీ స్పందిస్తూ అదేం సంకేతమో తనకు తెలియదని, కానీ ప్రతి మ్యాచ్‌లోనూ కొత్తగా ఏదో ఒకరకంగా సెలబ్రేట్ చేసుకుంటానని, తన సెలబ్రేషన్లో ఎటువంటి అర్థం లేదని, గత మ్యాచ్‌లో కూడా భిన్నంగా తాను సెలబ్రేట్ చేసుకున్నట్లు సూర్యవంశీ చెప్పాడు. ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటానన్నాడు.
An entertainer on the field and even off it 😄
That’s Vaibhav Sooryavanshi for you 😌
Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/XO3ZKPPJWb
— IndianPremierLeague (@IPL) May 19, 2026
ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలువాల్సిన పోరులో రాజస్థాన్ రాయల్స్ సత్తాచాటింది. వైభవ్ వీరబాదుడు బ్యాటింగ్‌తో చెలరేగడంతో సొంతగడ్డపై మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లక్నోపై ఘన విజయం సాధించింది. లీగ్‌లో ఏడో విజయంతో పంజాబ్‌ను వెనక్కునెట్టి నాలుగో స్థానానికి చేరింది. తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా రాయల్స్ నేరుగా ప్లేఆఫ్స్ చేరుకోనుంది. లక్నో ఇచ్చిన 221 పరుగుల లక్షాన్ని రాయల్స్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ధ్రువ్ జురెల్ (38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 నాటౌట్), స్టాండిన్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ (43) కూడా రాణించారు. తొలుత మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 96), జోష్ ఇంగ్లిస్ (29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) మెరుపులతో లక్నో 20 ఓవర్లలో 220/5 స్కోరు చేసింది. వైభవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

