షమి బౌన్సర్.. కోహ్లికి గాయం!

సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు ఓ ఆందోళన కలిగించే వార్త. నెట్ ప్రాక్టీస్‌లో షమి విసిరిన బౌన్సర్‌కు విరాట్ కోహ్లి గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం టీమిండియా ప్రాక్టీస్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని, అతడు మూడు నుంచి ఆరు వారాలు దూరం కావాల్సి వస్తుందని ఆజ్‌తక్ న్యూస్ చానెల్ చెబుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. షమి విసిరిన బంతి కోహ్లి పక్కటెముకలకు బలంగా తగిలిందని వస్తున్న వార్తలు పుకార్లే అని ఇదే షోలో పాల్గొన్న విక్రాంత్ గుప్తా చెప్పారు.
ఒకవేళ కోహ్లికి గాయం అన్నది నిజమైతే మాత్రం ఇండియన్ టీమ్ పెద్ద దెబ్బ పడినట్లే. రెండు రోజులుగా టీమిండియా సభ్యులంతా కలిసి ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం కూడా కోహ్లి, షమితోపాటు బుమ్రా, గిల్ వంటి ప్లేయర్స్ నెట్స్‌లో చెమటోడ్చారు. ఈ నెల 18న ఫైనల్ ప్రారంభం కానుండగా.. అక్కడి మేఘావృతమైన వాతావరణానికి అలవాటు పడటానికి టీమ్‌కు వారం రోజుల సమయం ఉంది. కోహ్లి గాయంపై వస్తున్న వార్తలపై బీసీసీఐ ఏదైనా ప్రకటన ఇస్తుందా లేదా చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

