హైదరాబాద్, ఆట ప్రతినిధి: మల్లయుద్ధ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధమయ్యేలా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.
ముకేశ్గౌడ్ స్మారక టోర్నీలో వివిధ విభాగాల్లో దాదాపు 700 మంది యువ రెజ్లర్లు పోటీపడుతున్నారు. ఈనెల 12 వరకు జరిగే టోర్నీలో రూ.30 లక్షల నగదు బహుమతి, రూ.5 లక్షల ఉపకార వేతనం అందిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.