పసుపు రంగులో: ఉప్పల్ స్టేడియం పసుపు రంగు పులుముకుంది. తమ అభిమాన ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన ఫ్యాన్స్..చెన్నై జెర్సీలు ధరించి స్టేడియాన్ని హోరెత్తించారు. స్టాండ్స్‌లో ఎక్కడ చూసినా ఫ్యాన్స్ యెల్లో జెర్సీలతో సందడి సందడి చేశారు.
ఇన్నింగ్స్ 20వ ఓవర్లో చెన్నై దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ మైదానంలో అడుగుపెట్టాడు. ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడని భావిస్తున్న నేపథ్యంలో మైదానంలో అడుగుపెట్టడమే ఆలస్యం..ఒక్కసారిగా అభిమానులు ధోనీ ధోనీ అంటూ అభిమానులు దిక్కులు పిక్కటిల్లేలా అరవడంతో స్టేడియం ఒక్కసారిగా ఊగిపోయింది.