హైదరాబాద్, అక్టోబర్27 (నమస్తే తెలంగాణ): గిరిజన సాంసృతిక పరిశోధన, శిక్షణ సంస్థ (టీసీఆర్టీఐ) ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈనెల 30 వరకు గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ చాంపియన్ షిప్- 2025 జరుగనుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురసరించుకుని జన జాతీయ గౌరవ వర్ష్ (జేజేజీవీ)లో కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ మార్గదర్శకాల మేరకు హుస్సేన్‌సాగర్ బోట్స్ క్లబ్ (సెయిలింగ్ అనెక్స్)లో ఉదయం 10.30 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలిపింది. ప్రారంభ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, మిగిలిన మంత్రులు పాల్గొంటారని పేర్కొన్నది.