సిడ్నీ: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య మూడో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న డేవిడ్ వార్నర్ ఖవాజ బ్యాటింగ్‌తో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా ఆరు పరుగులు చేసింది. పాక్ స్కోరుకు ఆసీస్ ఇంకా 307 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. కమిన్స్ మరోమారు ఐదు వికెట్లతో విజృంభించాడు.