హైదరాబాద్, ఆట ప్రతినిధి: న్యూఢిల్లీ వేదికగా జరిగిన 67వ జాతీయ స్కూల్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణ అండర్-17 బాలుర టీమ్ కాంస్య పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన బాలుర టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో తెలంగాణ 1-3 తేడాతో ఢిల్లీ చేతిలో ఓటమిపాలైంది.
అయితే కాంస్య పతక పోరులో తెలంగాణ టీమ్ 3-1తో హర్యానాపై గెలిచి సత్తాచాటింది. వేర్వేరు గేముల్లో మన టీమ్ తరఫున జతిన్దేవ్ 2-0తో రుషికేశ్పై, దేవాంశ్సింగ్ 2-1తో ధనంజయ్పై, జతిన్దేవ్ 2-0తో సార్తక్ ఆర్యపై గెలువగా, రిషబ్ 0-2తో సార్తక్ చేతిలో ఓటమిపాలయ్యాడు.