హైదరాబాద్, ఆట ప్రతినిధి: త్వరలో జరుగనున్న 75వ జాతీయ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ కోసం తెలంగాణ టీమ్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ట్రయల్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన 49 మంది ప్లేయర్లను శిక్షణాశిబిరానికి ఎంపిక చేశారు. వోక్సెన్ యూనివర్సిటీ సహకారంతో అండర్-18 రాష్ట్ర బాస్కెట్‌బాల్ జట్లు ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాయి.
ఈనెల 30వ తేదీతో ముగియనున్న ట్రైనింగ్ క్యాంప్‌లో 25 మంది అమ్మాయిలు, 24 మంది అబ్బాయిలు శిక్షణ పొందుతున్నారు. అమృత్‌రాజ్, ఏసు రెండు జట్లకు కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(టీబీఏ) ప్రధాన కార్యదర్శి పృథ్వీశ్వర్‌రెడ్డి శిక్షణాశిబిరాన్ని పర్యవేక్షిస్తున్నారు.