న్యూఢిల్లీ: భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ అధికారికంగా ఖరారైంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమ్ఇండియా..ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం అధికారికంగా ప్రకటించారు. దాదాపు 19 ఏండ్ల తర్వాత తొలిసారి బెల్ఫాస్ట్లో ఆడబోతున్న భారత్..జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో తలపడుతుంది.
ఐర్లాండ్ క్రికెట్ హై ఫెర్ఫార్మెన్స్ డైరెక్టర్ గ్రహం వెస్ట్ సిరీస్‌పై ప్రకటన నేపథ్యంలో బీసీసీఐ స్పందిస్తూ తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. ఇదిలా ఉంటే జూలై 1నుంచి 19వ తేదీ వరకు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు టీమ్ఇండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.