హైదరాబాద్,ఆట ప్రతినిధి : మాన్సూన్ రెగటా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలర్ల జోరు కొసాగుతోంది. హుస్సేన్‌సాగర్ వేదికగా బుధవారం అండర్-16 ఆప్టిమిస్ట్ క్లాస్‌లో తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ (టీఎస్ఏ) సెయిలర్ నిల్కొండ మణి రెండు రేసుల్లో టాప్-3లో నిలిచి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
డిఫెండింగ్ నేషనల్ చాంప్ రవికుమార్ ఒక రేసులో విజయం, మరో రేసులో రెండో స్థానంతో ద్వితీయ స్థానంలోకి రాగా.. వుట్ల నరసింహ మూడో స్థానానికి చేరుకున్నాడు. బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన రమీజా భాను టాప్‌లో కొనసాగుతుండగా.. 29ఇఆర్ స్కిఫ్స్ క్లాస్‌లో వినోద్ దండు – అరవింద్ జోడీ స్వర్ణ పతక రేసులో ఉంది.