మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబర్ 13 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్ గ్రామర్ హైస్కూల్ మైదానంలో రాష్ట్రస్థాయి అండర్-19 బాలబాలికల హ్యాండ్‌బాల్ పోటీలు శనివారం రెండోరోజూ హోరాహోరీగా కొనసాగాయి. ఈ పోటీలో ఉమ్మడి పది జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.
లీగ్ మ్యాచ్‌ల్లో బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ 12-05 తేడాతో మెదక్ జట్టుపై విజయం సాధించగా.. కరీంనగర్ 17-0 తేడాతో నల్లగొండపై, ఖమ్మం 13-2తో మెదక్‌పై, ఆదిలాబాద్ 9-6తో నల్లగొండపై, రంగారెడ్డి 2-1తో నిజామాబాద్‌పై, వరంగల్ జట్టు 13-5తో హైదరాబాద్‌పై, ఖమ్మం 12 -3తో రంగారెడ్డిపై, వరంగల్ 9-0తో నల్లగొండపై గెలుపొందాయి.
బాలుర విభాగంలో ఖమ్మం, రంగారెడ్డి, మెదక్, వరంగల్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ విజయాలు సాధించాయి. సెమీస్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ బాల, బాలికల జట్లు హోరాహోరీగా పోరాడి గెలుపొందాయి.