సింగపూర్: సింగపూర్ ఓపెన్‌లో భారత యువ జోడీ గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ సంచలన విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి గత పోరులో ప్రపంచ నంబర్2 జోడీని చిత్తుచేసిన గాయత్రి, త్రిసా అదే ప్రదర్శనను పునరావృతం చేశారు.
శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో గాయత్రి, త్రిసా ద్వయం 18-21, 21-19, 24-22తో కొరియా జంట కిమ్ సోయంగ్, కాంగ్హీ యాంగ్‌పై అద్భుత విజయం సాధించింది. శనివారం జరిగే సెమీస్‌లో జపాన్‌కు చెందిన నమి మత్సుయమ, చిహారు షిదాతో తలపడుతుంది.