జకార్తా: ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆశలు మోస్తున్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌లో ఈ జోడీ 19-21, 16-21తో మలేషియాకే చెందిన మన్ వీ చోంగ్-టీ కై వున్ చేతిలో అపజయం పాలయ్యింది.
2023లో ఈ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్న భారత జంట.. తాజా ఎడిషన్‌లో మాత్రం ఆ మ్యాజిక్‌ను పునరావృతం చేయలేకపోయింది. 43 నిమిషాల్లోనే ముగిసిన క్వార్టర్స్‌లో మలేషియా కుర్రాళ్లు.. వరుస గేమ్స్‌ను గెలుచుకుని సెమీస్‌కు దూసుకెళ్లారు.