రావల్పిండి: ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత భయాందోళనలకు గురైన శ్రీలంక జట్టుకు భద్రత కల్పించేందుకు పాకిస్థాన్ సైన్యం రంగంలోకి దిగింది.
పాక్‌తో వన్డేలు, ముక్కోణపు సిరీస్ ముగిసేదాకా లంకేయుల భద్రతను పాకిస్థాన్ ఆర్మీ చూసుకుంటుందని పీసీబీ చైర్మన్, ఆ దేశ మంత్రి మోహ్సిన్ నఖ్వీ తెలిపారు.