లండన్: ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలుసు కదా. నాలుగోరోజు ఆటలో భాగంగా మొదట ఆండర్సనే కోహ్లిని కవ్వించేలా మాట్లాడాడు. దీనికి విరాట్ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ నీ జాగీరేమీ కాదు అంటూ కోహ్లి చాలా ఘాటుగా స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్‌గా మారింది. ఇప్పుడు దీనిపై ఇంగ్లండ్ మరో పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందిస్తూ.. కోహ్లికి కౌంటర్ వేశాడు. అవును.. లార్డ్స్ ఆండర్సన్ జాగీరే. కావాలంటే అక్కడి బోర్డు చూడు.. నీలోని ఫైర్ బాగుంది కానీ ఆ భాషే నిన్ను కష్టాల్లో పడేస్తుంది అని బ్రాడ్ ట్వీట్ చేశాడు.
The Lord’s honours board suggests it’s as close to Jimmy’s backyard as Jimmy’s actual backyard. Love the fire but that language will have him in trouble
— Stuart Broad (@StuartBroad8) August 15, 2021