న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను జూన్ 4 నుంచి 30 మధ్య నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రాథమికంగా నిర్ణయించింది. నిరుడు ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్ జరుగగా.. వచ్చే యేడు వెస్టిండీస్, అమెరికా సంయక్తంగా మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.
మరో వారం రోజుల్లో ఐసీసీ ప్రతినిధి బృందం అమెరికాలో పర్యటించి వేదికలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విండీస్ టూర్లో ఉన్న భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లను అమెరికాలోనే ఆడనుంది. అదే సమయంలో ఐసీసీ సభ్యులు ఆ మైదానాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.