Iga Swiatek | ఇండియన్ వెల్స్(అమెరికా): ఇండియన్ వెల్స్ టోర్నీలో పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగి ల్స్ సెమీఫైనల్లో టాప్ ర్యాంకర్ స్వియాటెక్ 6-2, 6-1తో మార్టా కోత్సుక్పై అలవోక విజయం సాధించింది. దీంతో ఈ ఏడాది స్వియాటెక్ విజయాల సంఖ్య 19-2కు చేరుకుంది.
సెమీస్ చేరుకునే వరకు స్వియాటెక్ కేవలం 17 గేములు చేజార్చుకుంది. మ్యాచ్ విషయానికొస్తే.. కొత్సుక్ నాలుగుసార్లు డబుల్ ఫాల్ట్స్ చేస్తే.. స్వియాటెక్ సున్నాకు పరిమితమైంది. స్వియాటెక్ తన తొలి సర్వ్‌లో 74 శాతంతో ఉంటే కొత్సుక్ 50 శాతంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో గ్రీస్ ప్లేయర్ మారియా సకారితో స్వియాటెక్ తలపడుతుంది.