బిస్బేన్: టీ20 ప్రపంచకప్‌లో తొలి పోరుకు పదిహేను రోజుల ముందే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత జట్టు.. సాధనలో మునిగిపోయింది. గాయం కారణంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెగాటోర్నీకి దూరం కాగా.. అతడి స్థానంలో ఎంపికైన మహమ్మద్ షమీ ఆదివారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు.
ఇటీవల కొవిడ్-19 బారినపడి కోలుకున్న షమీ.. పూర్తి స్థాయి సామర్థ్యంతో బంతులేస్తూ కనిపించాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో కాసేపు వర్కౌట్స్ చేసిన షమీ ఆ తర్వాత నెట్స్‌లో సుదీర్ఘంగా బంతులేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లాడనుండగా.. నేడు ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ పూర్తి బలగంతో బరిలోకి దిగే అవకాశముంది.