న్యూఢిల్లీ: ఇండియన్ ఓపెన్ టోర్నీలో భారత షట్లర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్లోనే ఔట్ కాగా తాజాగా కిడాంబి శ్రీకాంత్ అదే బాట పట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో శ్రీకాంత్ 14-21, 19-21 తేడాతో ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. రెండో గేమ్‌లో ఒక దశలో 14-5తో ఆధిక్యం కనబరిచినా.. అక్సెల్సెన్ విజృంభణతో ఒత్తిడికి గురై మ్యాచ్ చేజార్చుకున్నాడు. మహిళల డబుల్స్‌లో భారత ద్వయం అశ్విని భట్, శిఖా గౌతమ్ ఓటమిపాలైంది. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ 15-21, 12-21తో బీవెన్ జాంగ్(మలేషియా) చేతిలో ఓడింది.