ఢిల్లీ: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ మస్కట్ 2026 టోర్నీలో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ మనూష్ షా-దివ్య చిటాలె ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
ఒమన్‌లో జరుగుతున్న ఈ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లో భారత జోడీ.. 3-1 (10-12, 8-11, 11-8, 11-8)తో పాంగ్-జెంగ్ (సింగపూర్) జోడీని ఓడించి ఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్‌లో మనూ ష్, మహిళల సింగిల్స్‌లో మణికా బాత్రా ఓటముల పాలయ్యారు.