షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-2లో భారత పురుషుల, మహిళల కాంపౌండ్ జట్లు మెయిన్ రౌండ్‌కు అర్హత సాధించాయి. మంగళవా జరిగిన పురుషుల క్వాలిఫికేషన్ రౌండ్లో ఓజస్ ప్రవీణ్, సాహిల్ జాదవ్, కుశాల్ దలాల్‌తో కూడిన భారత త్రయం.. 2,130 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానం సాధించింది.
మహిళల విభాగంలో భారత్ ఐదో స్థానం అందుకుంది. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రగతి, అదితితో కూడిన త్రయం 2,092 పాయింట్లతో మెరిసింది.