అస్తానా: వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నీలో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. మహిళల 80కిలోల సెమీఫైనల్ బౌట్లో నూపుర్ 5-0 తేడాతో సెయిమా దుస్తజ్ (టర్కీ)పై అలవోక విజయం సాధించి ఫైనల్ చేరింది. పురుషుల 65కిలోల క్వార్టర్స్ బౌట్లో అభినాశ్ జమ్వాల్.. రెనె కమాచో (అమెరికా)పై ఏకపక్ష విజయం సాధించాడు.
నీరజ్ఫోగట్ (65కి), అనామిక (51కి) వేర్వేరు విభాగాల్లో ప్రత్యర్థుల చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించారు.