దుబాయ్ : స్టాప్ క్లాక్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రస్తుత ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో ప్రారంభించనున్నట్టు ఐసీసీ వెల్లడించింది. ఈ కొత్త విధానంలో ఒక ఓవర్ ముగిసిన తరువాత తదుపరి ఓవర్‌ను ఫీల్డింగ్ జట్టు 60 సెకండ్ల వ్యవధిలో ప్రారంభించాల్సి ఉంటుంది.
రెండుసార్లు హెచ్చరికల అనంతరం మూడోసారి ఈ తప్పిదానికి పాల్పడితే అయిదు పెనాల్టీ పరుగులను విధిస్తారు. సమయం వృథాను అరికట్టేందుకు ఈ చర్య చేపట్టినట్టు ఐసీసీ జనరల్ మేనేజర్ వాసిం ఖాన్ తెలిపారు. ఇంగ్లండ్-వెస్టిండీస్ సిరీస్‌లో ఫలితాలను బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నామన్నారు.